telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్ఎస్ లో కరోనా కలకలం..మరో ఎంపీకి పాజిటివ్

pothuganti ramulu MP Trs

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే వుంది. వివిధ శాఖల ఉద్యోగులతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా మరో టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములుకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా… పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తతం ఆయన ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. తనతో కాంటాక్ట్ ఐన వాళ్ళు కరోనా పరీక్షలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా..తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక 24 గంటల్లో ఆరుగురు కరోనా తో మృతిచెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,29,001కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 2,07,326మంది కోలుకున్నారు. తాజా మరణాలతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 20,377 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.56 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 89.5 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 90.53 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 20,183 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 38,484 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Related posts