telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

నల్లా కనెక్షన్స్ లో తెలంగాణ అగ్రస్థానం!

Tap connection

నల్లా కనెక్షన్స్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర జలవనరుల శాఖ రిపోర్టు ఇచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ 98.29 శాతం నల్లా కనెక్షన్స్ ఇవ్వగా, గోవాలో 89.05 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల తర్వాత ఎక్కువ నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాల్లో పుదుచ్చేరి నిలిచింది.

దేశంలోనే అత్యధిక మంచి నీటి నల్లా కనెక్షన్‌లు ద్వారా ఇంటింటికి మంచి నీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర జలవనరుల శాఖ రిపోర్టు ఇచ్చింది. హర్యానా, గుజరాత్ టాప్ 5 లిస్టులో ఉన్నాయి. ఇక 34.62 శాతం నల్లా కనెక్షన్లతో ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో నిలవగా, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో చివరి స్థానాల్లో ఉన్నాయి.

Related posts