చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ మాజీ సిఎం దిగ్విజయ్ సింగ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఢిల్లీ లోని తన నివాసం లో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన పార్టీ నేతలు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. కొన్ని రోజులపాటు హోమ్ క్వారెంటైన్ ఉండాలని కోరారు దిగ్విజయ్ సింగ్.
previous post
next post