‘తీన్‌మార్’ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బండ్ల గణేష్ ట్వీట్స్ చేశారు. ”తీన్ మార్ చిత్రం నా జీవితంలో ఓ ప్రత్యేకమైన చిత్రం విజయం సాధించక పోయినప్పటికీ చిత్ర నిర్మాణం నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది” అని పేర్కొన్న ఆయన ఆ తర్వాత వరుస కామెంట్స్ పెట్టారు. పవన్ కళ్యాణ్ హీరోగా 2011 సంవత్సరంలో వచ్చిన ‘తీన్‌మార్’ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. సరిగ్గా ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా నేటితో 9 ఏళ్ళు పూర్తిచేసుకోనుంది. ఈ చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ఈరోజు కూడా సాంగ్స్ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది ఉదాహరణకు వయ్యారాల జాబిల్లి అని, ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల అనుకున్నంత విజయం సాధించలేక పోయినప్పటికీ ఇందులో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయని, ఈ మూవీ నిర్మించే అవకాశం తనకిచ్చిన దైవ సమానులైన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక్కసారి హృదయపూర్వక పాదాభివందనం అని బండ్ల గణేష్ తెలిపారు. దయచేసి అందరికీ ఇంకొకసారి చెప్పేది ఏంటంటే నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఎవరి రాజకీయాలతో నాకు అవసరం లేదు. కరోనా లాంటి మహమ్మారిని చూసిన తర్వాత కూడా మనం నిజాయితీగా ఉండకపోతే ఈ జన్మే వ్యర్ధం నమ్ముతున్నా. ప్రేమిస్తే ప్రాణం ఇస్తా ప్రేమించకపోతే దూరంగా ఉంటా నీ ప్రేమకు నేను బానిసని అని అన్నారు బండ్ల గణేష్.
ఈ చిత్రం నిర్మించే అవకాశం నాకు ఇచ్చిన నాకు దైవ సమానులైన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక్కసారి హృదయపూర్వక పాదాభివందనం@PawanKalyan #Trivikram #9YearsForTeenMaar pic.twitter.com/eY1sf2HHRS
— BANDLA GANESH (@ganeshbandla) April 14, 2020