ఏపీలోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సిఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్ట్ లను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు సిద్దమైంది. అవసరమైన ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్ రూపొందించేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్నీ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీ లలో ఉన్న ఉద్యోగాల ఖాళీల వివరాలను తేల్చాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా ఖాళీల భర్తీకి సంబంధించి సీఎస్ ఇటీవలే అన్నీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అయితే తాజా లెక్కల ఆధారంగా ఖాళీ పోస్టులను దశల వారీగా భర్తీ చేసేందుకు ప్రణాళికా బద్దంగా క్యాలెండర్ రూపొందించి మే 31న విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఇందు కోసం గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీల్లో పోస్టుల ఖాళీలను లెక్క తేల్చాలని సూచించారు.
previous post
కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు: భట్టి విక్రమార్క