telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. తెరాస అవినీతి.. బట్టబయలు చేస్తామంటున్న బీజేపీ ..

bjp leader lakshman on trs power agreements

గతంలోనూ విద్యుత్‌ ఒప్పందాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామని బీజేపీ లక్ష్మణ్‌ చెప్పారు. విద్యుత్‌ కొరత పేరుతో హడావుడిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు. విద్యుత్‌ బకాయిలు ఉంటే సర్పంచ్‌లను సస్పెండ్‌ చేస్తామని ప్రభుత్వం అంటోందని, రాష్ట్రంలో డిస్కంలకు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, సీఎం కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. విద్యుత్‌ కొనుగోళ్లకు అధిక రేటు చెల్లించడంపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చత్తీస్‌గఢ్‌లో ఏ ప్రభుత్వం ఉంది అనేది కాదని, తెలంగాణ ప్రయోజనమే తమకు ముఖ్యమన్నారు.

కేంద్రం నిషేధించిన సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీని భద్రాద్రి ప్లాంట్‌లో ఎందుకు వినియోగించారని మరోసారి ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో విద్యుత్‌ కొరత, అప్పటికే మిషనరీలు కొనడంతో సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. 2017లోగా ప్లాంట్‌ పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించింది. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం నేరుగా అవినీతిపై విచారణ జరిపించలేదు. టీఆర్‌ఎస్‌ అవినీతిపై ఆధారాలున్నాయి. విద్యుత్‌ ఒప్పందాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తే ఆధారాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. తప్పు చేయకుంటే సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఎందుకు ఇవ్వరు? టీఆర్‌ఎస్‌ అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం..అని లక్ష్మణ్‌ చెప్పారు.

Related posts