telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పోలీసులకు ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ చేసిన బాలుడు… వాళ్ళు ఏం చేశారంటే ?

Pizza

అమెరికాలో ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు 911కు ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు 911కు ఫోన్ చేసి తనకు ఆకలేస్తోందని, పిజ్జా ఆర్డర్ చేయమని చెప్పాడు. దీంతో ముగ్గురు పోలీసు అధికారులు బాలుడి ఇంటికి వెళ్లారు. బాలుడి సోదరి పోలీసులను చూసి కంగారు పడింది. జరిగిన విషయం తెలుసుకుని అధికారులకు క్షమాపణలు తెలిపింది. తమకు తెలియకుండా సోదరుడు ఫోన్ చేశాడంటూ సమాధానమిచ్చింది. పోలీసు అధికారులు ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా.. బాలుడికి లార్జ్ పిజ్జాను బహుమతిగా ఇచ్చారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలోనే తమకు ఫోన్ చేయాలంటూ నెమ్మదిగా పిల్లలకు అర్థమయ్యే భాషలో వివరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడి పిల్లలకు మాత్రం 911కు ఏ సమయంలో ఫోన్ చేయాలనే విషయంపై అవగాహన లేకపోవడంతో పోలీసులకు పిల్లల నుంచి అనేక ఫోన్లు వస్తున్నాయి. ఇటీవల ఓ పిల్లోడు పోలీసులకు ఫోన్ చేసి ఆడుకోడానికి ఎవరూ లేరంటూ తన ఆవేదన చెప్పుకున్నాడు. దీనిపై స్పందించిన ఓ పోలీసు అధికారి నిజంగానే బాలుడి ఇంటికి వచ్చి కాసేపు బాలుడితో సరదాగా ఆడుకుని.. ఓ బొమ్మను గిఫ్ట్‌గా ఇచ్చి 911కు ఏ సమయంలో ఫోన్ చేయాలన్న దానిపై సూచించి వెళ్లారు.

Related posts