ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో సినీ నటుడు అలీ ఆదివారం సమావేశమయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు చంద్రబాబుతో అలీ మంతనాలు జరిపారు. ఇటీవల కాలంలో అలీ సీఎంను కలవడం ఇది రెండో సారి. అలీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. తెలుగు దేశం పార్టీలో ఆలీ చేరతాని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
అలీ వైసీపీ, జనసేనలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను రైల్వే స్టేషన్‌లో కలిశానని అలీ ప్రకటించారు. టీడీపీ తరఫున గుంటూరు టికెట్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. అలీ టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదే అభిప్రాయాన్ని కూడ జనసేన నేతలు కూడ చెబుతున్నారు.
జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలే: సీపీఐ నారాయణ