telugu navyamedia
క్రీడలు వార్తలు

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వేదికలో మార్పు…

ICC

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వేదిక మారింది. మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ కేంద్రమైన లార్డ్స్‌ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. అయితే ఇంగ్లండ్‌లో తాజా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చింది. ఒప్పందం ప్రకారం ఇంగ్లండ్‌లో జరపాల్సి ఉండటంతో సౌతాంప్టన్‌కు మ్యాచ్‌ను తరలించారు. ఇక్కడి రోజ్‌బౌల్‌ మైదానంలో ఇరు జట్లు తుది పోరులో తలపడతాయి. స్టేడియం లోపలి భాగంలోనే ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఉండటంతో ‘బయో బబుల్‌’ ఏర్పాటు చేసేందుకు ఇది సరైన చోటుగా ఐసీసీ భావించింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. మే 30న ఐపీఎల్‌ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళుతుంది. ఐసీసీ ఇప్పటికే సదరు హోటల్‌ మొత్తాన్ని జూన్‌ 1 నుంచి 26 వరకు బుక్‌ చేసేసింది. అక్కడే టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పాటించాల్సి ఉంటుంది.

Related posts