telugu navyamedia
క్రీడలు వార్తలు

నా బయోపిక్ పై నాకు ఆసక్తి లేదు: గవాస్కర్

Cricketer Sunil Gavaskar Comments Biopic

క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ధోనీ తదితరుల జీవిత కథతో బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరో వైపు టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బయోపిక్ పై స్పందించారు. తన బయోపిక్ పై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని చెప్పారు. తన జీవితం బయోపిక్ తీసేంత ఆసక్తికరంగా ఉండదని అన్నారు. తనది సర్వసాధారణమైన రొటీన్ లైఫ్ అని చెప్పారు. ఒక సినీ ప్రేక్షకుడిగా కూడా తన బయోపిక్ ను తెరపై చూడాలనుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు ఇతరులకు మాత్రం ఆసక్తి ఎందుకు ఉంటుందని గవాస్కర్ వ్యాఖ్యానించారు. బయోపిక్ తీస్తామంటూ ఇప్పటికే తన వద్దకు ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.

Related posts