నా ఎద కావ్య పుటల్లో
చెరగని వలపు సంతకమై_
నన్ను ప్రేమ సంకీర్తనలు అల్లే
ప్రణయ కవిని చేశావు-
నాలో విలువలకి
ప్రణయామృత
స్రోతస్వని వై _
నీతి వటవృక్షాలను
ప్రణయ బాట ప్రక్క
పద్ధతిగా నాటంచావు_
మల్లి పూల వల్లి వై_
ప్రేమ పరిమళాలు
నాలో వ్యాపింప చేస్తున్నావు!
ఓ నవమల్లికా!
నీ అరమోడ్పు చూపుల
ప్రేమ వసంతంలో
ప్రణయ సరాగమై-
విపుల పూల పరాగమై –
నాలో సగమై – నీవే నా జగమై-
పరవసిస్తున్నాను _
నీదు ప్రేమ జలధిలో
నేనొక అలనై _
ఓలలాడుతున్నాను_
నీ తలపుల్లో కవితనై
నిత్యం ప్రభవిస్తున్నాను
-అంశుమాలి, టెక్కలి