పుణే నగరంలోని నాయుడు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఛాయ జగతాప్ అనే నర్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనూహ్యరీతిలో ఫోన్ కాల్ చేశారు. ప్రధాని అంతటివాడు తనకు నేరుగా ఫోన్ చేయడంతో ఆచ్ఛార్యానికి గురైంది. మరాఠీలో సంభాషణ మొదలుపెట్టిన మోదీ, తొలుత నర్సు యోగక్షేమాలను అడిగారు.
రోగులకు సేవ చేసే సమయంలో కుటుంబం గురించి ఏం ఆలోచిస్తారుఅంటూ ప్రధాని ప్రశ్నించారు. వెంటనే నర్సు బదులిస్తూ, కుటుంబం పట్ల కూడా ఆందోళన ఉండడం సహజమే అయినా, రోగులకు సేవ చేయడం తమ విధి అని తెలిపింది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో సేవలు అందించడాన్ని విద్యుక్త ధర్మంగా భావిస్తామని తెలిపింది. కరోనా మహమ్మారిపై స్ఫూర్తి కలిగించే ఆమె మాటలను ప్రధాని మోదీ ప్రశంసించారు.