telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పెట్రోల్ ధరల పెంపు పై మోడీ ఎమ్మనడంటే..?

Modi Mask

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. పెట్రో ధరలు 70లో ఉనప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మోడీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పెట్రో ధరల పెంపుపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంధనం కోసం మన దేశం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోందని, ఇది సరైనదేనా? అని ఎదురు ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఈ అంశంపై శ్రద్ధ తీసుకోలేదని.. తమిళనాడులో ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్టులను ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన సందర్భంగా దుయ్యబట్టారు మోడీ.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ అవసరాల్లో 85 శాతం ఆయిల్‌ను, 53 శాతం గ్యాస్‌ను దిగుమతి చేసుకున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మోడీ.. వైవిధ్యభరితమైన, ప్రతిభా సంపన్నమైన మనలాంటి దేశం ఇంధనం కోసం దిగుమతులపై ఇంతగా ఆధారపడవచ్చునా? అని ప్రశ్నించారు. తాను ఎవరినీ విమర్శించాలని అనుకోవడం లేదని, అయితే మనం దీనిపై చాలా ముందుగానే దృష్టి సారించి ఉంటే ఇప్పుడు ఇంతలా ఇబ్బంది పడేవారు కాదని చెప్పుకొచ్చారు. ఇక, మధ్య తరగతి ప్రజల ఆందోళనలను తాము అర్థం చేసుకోగలం.. రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేందుకు ఇథనాల్‌పై మన దేశం దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు.

Related posts