telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ బంద్ : .. సకల వర్గాల నుండి .. సానుకూల స్పందన.. చర్చల్లేవ్ ..

telangana band in progress no govt move

నేటి తెలంగాణ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె ప్రారంభించిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు రోజు రోజుకీ మద్దతు పెరుగుతోంది. కోర్టు సూచించినా ఇప్పటి వరకు ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించలేదు. అదే సమయంలో కార్మిక సంఘాలు సైతం సమ్మె విరమించలేదు. అటు ప్రభుత్వం..ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా రాజకీయ పార్టీలు..ప్రజా సంఘాలు..అనేక ఉద్యోగ సంఘాలు మద్దతుగా నిలిచాయి. రెవిన్యూ ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. దీంతో..జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు సమ్మె ప్రారంభమైంది. సమ్మె ప్రభావం లేదని చాటటానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బస్సు డిపోల ముందు ధర్నాలు చేస్తున్న కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం 18 సంఘాలే సమ్మెకు మద్దతు ప్రకటించాయి. హైకోర్టు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభించాలని సూచిన చేసింది. అయినా..ఇప్పటి వరకు ఆ విధంగా సంకేతాలు కనిపించటం లేదు.

బంద్ ప్రభావం లేదనే చెప్పే ప్రయత్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఉదయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపోల వద్ద ఆందోళనలకు దిగిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కోర్టు సూచన చేసినా ప్రభుత్వం చర్చలకు పిలవకపోటం పైన కార్మిక సంఘాలు ఆగ్రహంతో పాటుగా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంద్‌కు సహకరించాలని వ్యాపార, వాణిజ్య సంస్థలను ఆర్టీసీ కార్మికులు కోరారు. దాదాపుగా తెలంగాణలోని అన్ని పార్టీలు..అన్ని సంస్థల నుండి సమ్మెకు మద్దతు లభిస్తోంది. ఇక, సోమవారం నుండి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. సమ్మె కొనసాగితే..విద్యార్ధుల పరిస్థితి ఏంటనే ఆందోళన పేరంట్స్ లో కనిపిస్తోంది. ఈ రోజు బంద్ నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది చూడాలి. ఆర్టీసీ అధికారుల నుండి చర్చల దిశగా పిలుపు ఏమైనా వస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

Related posts