telugu navyamedia
క్రీడలు వార్తలు

అర్ధశతకం ఒక్కటే.. కానీ రికార్డులు మూడు..!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే ఈ ఒక్క అర్ధశతకంతో మూడు రికార్డులను తన పేరిట లికించుకున్నాడు కోహ్లీ. అయితే ఈ మ్యాచ్‌లో 73 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ టీ20ల్లో 3000 పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అలాగే హాఫ్ సెంచరీ బాదడం ద్వారా.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన క్రికెటర్‌గానూ నిలిచాడు. కోహ్లీకి టీ20 కెరీర్‌లో ఇది 26వ హాఫ్ సెంచరీ కాగా.. రోహిత్ శర్మ 25, మార్టిన్ గప్తిల్ 19 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక కెప్టెన్ ‌గానూ అంతర్జాతీయ క్రికెట్‌లో 12000 పరుగులు చేసిన తొలి భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు. అయితే ఈ విజయంతో సిరీస్ ను సమ చేసిన భారత్ మిగిలిన మూడు మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి వస్తుంది.

Related posts