telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

హైదరాబాద్ లో మొబైల్ రైతు బజార్లు.. ప్రజల వద్దకే కూరగాయలు

rythu bazar hyd

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. హైదరాబాద్ నగర వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జీహెచ్ఎం కూరగాయల సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

నగరంలో ప్రజల ఇళ్ల వద్దకే కూరగాయలు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో జీహెచ్ఎంసీ మొబైల్ రైతు బజార్లను ప్రారంభించింది. .ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 145 మొబైల్ రైతు బజార్లను ప్రారంభించామని, భవిష్యత్ లో వీటి సంఖ్య మరింత పెంచుతామని చెప్పారు.

Related posts