telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విజయ శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో డాలీ అండ్ నిహారిక ప్రెసెంట్స్ చేస్తూ ‘గోవిందా భజగోవిందా’

మెయిన్ టైటిల్ గా (air force batch) అనేది ఉప శీర్షిక. ఈ సినిమా ట్రైలర్ ని ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాధ్ రావు ఓపెన్ చేశారు. సినిమా ట్రైలర్ చాలా బాగుందని, సినిమాని అందరు ఆదరించాలని సినిమాని మంచి హిట్ చేయాలనీ కోరుకున్నారు. ట్రైలర్లో చాలా మంచి ఫన్ ఉందని కామెడీగా బాగా తీసారని డైరెక్టర్ త్రినాధ్ రావు మెచ్చుకున్నారు. ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూడాలని కోరుకున్నారు. అలాగే సినిమా డైరెక్టర్ సూర్య కార్తికేయ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చిందని 2గంటలు మీరు నవ్వుతూనే ఉంటారని ఈ సినిమాని జులై ఫస్ట్ వీక్లో రిలీస్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

సినిమా కామెడీని మీరు చాలా బాగా ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తారని చెప్పారు. సినిమాలో మంచి కామెడీతోపాటు ఓ మెసేజ్ ఇచ్చామని మీరందరు నిజ జీవితంలో ఏదైతే ప్రాబ్లెమ్స్ పేస్ చేస్తారో అదే కామెడీగా చూపించమని చెప్పారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా మ్యూజిక్, కెమెరా వర్క్ చాలా బాగా అనిపిస్తుందని మీరు నవ్వుతు థియేటర్ నుండి బయటకి వస్తారని చెప్పారు. డిఓపిగా మనోహర్ కొల్లి, ఎడిటర్ కిరణ్, మ్యూజిక్ ఆర్ జే చక్రవర్తి, డైరెక్టర్ సూర్య కార్తికేయ, ప్రొడ్యూసర్ గా ఉపేంద్ర, సూర్య కార్తికేయ నిర్మించారు.ప్రతి ఒక్కరు కూడా మా లాంటి చిన్న సినిమాలను ఆదరించాలని, మీకు వండర్ఫుల్గా సినిమా అనిపిస్తుందని తెలిపారు. సినిమాను ఎంతో సపోర్ట్ చేసిన వెంకట్ పల్లి, ఉత్తర ప్రశాంత్ కు థాంక్స్ చెప్పారు. జులై నెలలో మీకు ఒక మంచి సినిమా చూపించాబోతున్నామని, ఇది మా మొదటి ప్రయత్నం అని అలాగే మీకు మంచి సినిమాలు ఇక మీదట అందిస్తామని డైరెక్టర్ సూర్య కార్తికేయ తెలిపారు. యాక్టర్లుగా కమల్ తేజ నార్ల , ప్రియా శ్రీనివాస్, సూర్య తేజ కోట, విజయ్ కృష్ణ, హరి తేజ యాక్ట్ చేశారు. మీకు ఫన్ త్వరలో చూపించాబోతున్నామని టీమ్ అంత చెప్పారు.

Related posts