telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలు ఆమోదం

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా నగరంలో రోడ్లు, మజీద్ లను శుభ్రం చేయాలని, రోడ్లపై పేరుకుపోయిన చెత్తను వెనువెంటనే తొలగించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన వార్డు ఆఫీస్ కార్యాలయాల అధికారులు పబ్లిక్ గ్రీవెన్స్ ను స్వీకరించి నిర్ణీత కాలంలో పరిష్కరించేలా జోనల్ కమిషనర్లు పర్యవేక్షించాలని తెలిపారు. వార్డు కార్యాలయాల పై కార్పొరేటర్లు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఇ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెనడి, సిసిపి దేవేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్లు పంకజ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మమత, సామ్రాట్ అశోక్, శంకరయ్య పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీ సభ్యులు …. శాంతి సాయి జెన్ శేకర్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహమ్మద్ అబ్దుల్ ముక్తర్, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, ఆర్. సునిత, టి. మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
*స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన అంశాలు*
1.  సనత్ నగర్ సర్కిల్ దాసారం బస్తీ  వార్డు  నెంబర్ 100 లో రూ. 600 లక్షల వ్యయంతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ (కన్వెన్షన్ హాల్ ) నిర్మాణానికి తేదీ 30-5 2022,  20-9 2022 జరిగిన స్టాండింగ్ కమిటీ లో తీర్మానం చేసిన  నేపథ్యంలో అక్కడి నుండి  పాన్ బజార్ బేగంపేట్ సర్కిల్ వార్డు నెంబర్ 148 రామ్ గోపాల్ పేట్ లో గల జిహెచ్ఎంసి కి చెందిన ఓపెన్ ప్లేస్ లో స్థలం  మార్పు చేసి 450 గజలలో రూ.490 లక్షల రివైజ్డ్ అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టేందుకు  కమిటీ ఆమోదం.

2.  కల్పతరువు రెసిడెన్సీ నుండి తిరుమల కాన్వెంట్ స్కూల్ వరకు (కారిడార్ 2 మిస్సింగ్ లింక్ రోడ్డు నుండి భరత్ నగర్ ఆర్ ఓ బి నుండి హైటెక్స్ రోడ్డు నుండి వయా మోతి నగర్ బోరబండ, మల్లాపూర్) వరకు  30 ఫీట్ల రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వానికి అనుమతి సిఫార్సు తో పాటు  అందుకు 306 ఆస్తుల సేకరణ కోసం కమిటీ ఆమోదం.

3. ఎయిర్ పోర్ట్ రోడ్డు నుండి వయా  సిటడెల్ హోటల్, కన్వెన్షన్ మీదుగా  దివ్యశక్తి ప్రైవేట్ లిమిటెడ్ వరకు 12 మీటర్ల (40 ఫీట్ల) రోడ్డు వెడల్పు కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్.ఎం.డి.ఎ  జోన్ లో గల రాజేంద్ర నగర్ మండలం గగన్ పహాడ్ గ్రామంలో 15 ఆస్తుల సేకరణ కు ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు  కమిటీ  ఆమోదం.
4.  రోడ్డు వెడల్పు కార్యక్రమంలో బాగంగా బొల్లారం వద్ద ఆర్ ఓ బి నిర్మాణంతో పాటుగా కొంపల్లి నుండి స్టీవర్ట్ రోడ్డు వరకు వయా బొల్లారం నుండి కలవరి స్టేషన్ మీదుగా 24, 42 మీటర్ల రోడ్డు విస్తరణ మాస్టర్ ప్లాన్ లో కలిపి ప్రభుత్వానికి తెలియ జేస్తూ బొల్లారం కలవరి స్టేషన్ నుండి స్టీవర్ట్ రోడ్డు వరకు చేపట్టే రోడ్డు స్ట్రెచ్ కు 106 ఆస్తుల సేకరణ కు కమిటీ ఆమోదం.
5. బల్కంపేట్ నుండి వయా నేచర్ క్యూర్ హాస్పిటల్ మీదుగా అమీర్ పేట్ లాల్ హౌస్ బంగ్లా, శ్యామ్ కరణ్ వరకు 18 మీటర్ల రోడ్డు విస్తరణ సందర్భంగా 136 ఆస్తుల సేకరణ కోసం స్టాండింగ్ కమిటీ ఆమోదం.
6.  గాజుల రామారం సర్కిల్ చింతల్ ఐడిపిఎల్  క్రాస్ రోడ్డు వద్ద పురపాలక పట్టణ అభివృద్ధి సంస్థ  గతంలో  జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గా నిర్వహణ ఇతర స్పెసిఫికేషన్ కు సంబంధిన మార్గదర్శకాలకు అనుగుణంగా అర్బన్-లూ సంస్థ  సిఎస్ఆర్  పద్దతి ద్వారా మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి 14 సంవత్సరాలు  నిర్వహణ కొరకు,  సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ అనుసరించిన  యూజర్ చార్జెస్  వినియోగదారుల నుండి వసూలు చేసేందుకు జిహెచ్ఎంసి తరపున జోనల్ కమిషనర్ కూకట్ పల్లి కి ఒప్పందం చేసుకొనుటకు  కమిటీ ఆమోదం.
7. సికింద్రాబాద్ జోన్ లో  4 ప్రదేశాలలో  1. బషీర్ బాగ్ విజయ జ్యువలరీస్ ఎదురుగా, 2. YMCA నారాయణగూడ, 3. చే నంబర్ జంక్షన్, 4. మోండా మార్కెట్ వద్ద ఓల్డ్ జైల్ పార్కింగ్ ఎదురుగా మల్టీ పర్పస్  పబ్లిక్ ఫ్రెష్ రూమ్ ల నిర్మాణం, ఆపరేషన్, మెయింటేన్ ను   సిఎస్ఆర్ పద్దతి ద్వారా చేపట్టి వాటిని 14 సంవత్సరాల పాటు  నిర్వహణ కోసం అర్బన్-లూ  సంస్థ తో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్  ఒప్పందం చేసుకొనుటకు అధికారం ఇస్తూ కమిటీ ఆమోదం తెలిపింది.

8.  శేరిలింగంపల్లి జోన్ లో 1) కొండాపూర్ సర్కిల్ వార్డు నెంబర్  104 లో గల టెలికాం నగర్ లో గల హ్యుందాయ్ షోరూం ఎదురుగా, 2. మియాపూర్ సర్కిల్ 21, వార్డు నెంబర్ 108  మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర సి ఎస్ ఆర్ పద్ధతిలో  14 సంవత్సరాల నిర్వహణ మల్టీ పర్పస్  పబ్లిక్ ఫ్రెష్ రూం నిర్మాణానికి  అర్బన్-లూ సంస్థతో  ఒప్పందం చేసికొనుటకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కు అధికారం ఇస్తూ కమిటీ ఆమోదం.

9.  ఎల్బీనగర్ జోన్ లో 5 ప్రదేశాలలో 1) ఉప్పల్ సర్కిల్ లో రెండు వార్డు నెంబర్ 10 ఉప్పల్ జంక్షన్ మెట్రో స్టేషన్ ఎదురుగా, 2). ఉప్పల్ బస్ స్టాండ్ వెనుక బాగం లో, 3) ఎల్బీనగర్ సర్కిల్ వార్డు నెంబర్ 15  డి-మార్ట్ సుష్మా థియేటర్ వనస్థలిపురం, 4) ఎల్బీ నగర్  ఎక్స్ రోడ్ (ఫ్లైఓవర్ కింద) వనస్థలిపురం, 5) సరూర్ నగర్ సర్కిల్ వార్డ్ నెంబర్ 19 కొత్తపేట సిగ్నల్ ఓల్డ్ కోర్టు దగ్గర మరుగు దొడ్ల నిర్మాణం తో పాటు నిర్వహణ కొరకు,  సి ఎస్ ఆర్ పద్ధతిలో  స్వంత నిధులతో చేపట్టి 14 సంవత్సరాల పాటు నిర్వహణ కొరకు అర్బన్-లూ  సంస్థతో ఒప్పందం చేసుకొనుటకు ఎల్బీ నగర్ జోనల్  కమిషనర్ కు కమిటీ ఆమోదం.

10. చార్మినార్ జోన్ లో 1) నల్గొండ ఎక్స్ రోడ్ అల్ నూర్ మజీద్  DRDO వాల్, 2) కంచన్ బాగ్, 3) చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ దగ్గర 3 ప్రదేశాలలో  మరుగుదొడ్ల నిర్మాణానికి  సి ఎస్ ఆర్ పద్దతి  ద్వారా నిర్మాణాలు చేపట్టి 14 సంవత్సరాల పాటు నిర్వహణకు అనుమతి ఇస్తూ  చార్మినార్ జోనల్ కమిషనర్  ఒప్పందానికి  అధికారం ఇస్తూ  కమిటీ ఆమోదం.
11.   ఖైరతాబాద్ జోన్ లో  8 ప్రదేశాలలో 1) నాంపల్లి స్టేషన్, బేగం బజార్ ఫిష్ మార్కెట్ దగ్గర 3) మెహదీపట్నం బస్ స్టాప్, 4) అబిడ్స్, బి ఎస్ ఎన్ ఎల్ దగ్గర గల నెహ్రూ విగ్రహం ముందు జిపిఓ వద్ద, 5) కోటి మెట్రో స్టేషన్ వద్ద గల ఉస్మానియా మెడికల్ కాలేజ్, 6) కింగ్ కోటి లాస్ట్ గేట్ బస్ స్టాప్, 7). టోలిచౌకి ఫ్లై ఓవర్  వద్ద సి ఎస్ ఆర్ పద్ధతి  టాయిలెట్ నిర్మాణం, నిర్వహణ కొరకు 14 ఏళ్ల పాటు అర్బన్-లూ సంస్థ ఇచ్చుటకు గతం లో ప్రభుత్వ ఉత్తర్వ్యు 179MAUD date, 23-3-2017 మార్గదర్శకాలను  అనుసరించి అప్పగించిన సంస్థ అనుసరించాలని అందుకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కు అధికారం ఇస్తూ కమిటీ ఆమోదం తెలిపింది.

12.  శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామంలో గల ఈర్ల చెరువు 330 మీటర్ల  బాక్స్ డ్రైన్ ద్వారా డ్రైనేజ్ డైవర్షన్  మరియు   చెరువు యొక్క  నిర్మాణం ఇంటెక్ డైవర్షన్ చేయడం కోసం 21 -3-2023 న జరిగిన స్టాండింగ్ కమిటీ సివరేజ్ మళ్లింపు పైప్ లైన్ కోసం  రూ. 263 లక్షల రూపాయలు పరిపాలన అనుమతి  రద్దు చేస్తూ  బాక్స్ డ్రైన్  ద్వారా డ్రైనేజ్ మళ్ళించే పనిని చేపట్టుటకు షార్ట్ టెండర్ పిలువడానికి అనుమతికి కమిటీ ఆమోదం.

13. మదీనగూడ మండలం ఈర్ల చెరువు  (రీచ్-2) 330 మీటర్ల నుండి 720 మీటర్ల వరకు చేపట్టే డ్రైనేజ్ మళ్లింపు పనికి రూ.278  లక్షల అంచనా వ్యయంతో చేపట్టేందుకు షార్ట్ టెండర్  పిలువడానికి కమిటీ ఆమోదం.

14.  సర్కిల్ 17, ఖైరతాబాద్  వార్డ్ నెంబర్ 91 లో గల శిథిలావస్థలో ఉన్న పాత వార్డు ఆఫీస్ భవనం తొలగించి  తిరిగి అదే స్థలంలో G+4 మోడల్ వార్డ్ ఆఫీస్  నూతన భవన నిర్మాణానికి రూ.435 లక్షలు మంజూరు కు కమిటీ ఆమోదం.

15.  ఖైరతాబాద్ జోన్ సోమాజిగూడ సర్కిల్ వార్డ్ నెంబర్ 97 ఎల్లారెడ్డి గూడలో  పి జే ఆర్ కమ్యూనిటీ హాల్ రూ.550  లక్షల అంచనా వ్యయంతో చేపట్టే 1&2 ఫ్లోర్ లతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ రినోవేషన్, పార్కింగ్ ప్లేస్ కాంపౌండ్ వాల్ పనులకు కమిటీ ఆమోదం.

16.  రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా  హైటెక్స్ రోడ్డు నుండి ఎన్ కన్వెన్షన్ మీదుగా హైటెక్ సిటీ ఫ్లైఓవర్ వరకు(ఖనా మెట్), ఫుడ్ కోర్టు వరకు ఉన్న హైటెక్ సిటీ రోడ్ మాస్టర్ ప్లాన్ లో చేర్చి  ప్రతిపాదిత 36 ఫీట్ల రోడ్డు విస్తరణ చేసే ఫుడ్ కోర్టు నుండి హైటెక్ సిటీ వరకు 30 ఆస్తులు, హై టెక్ రోడ్ నుండి హైటెక్ సిటీ ఫ్లైఓవర్  వయా ఎన్ కన్వేషన్ (ఖనా మెట్) వరకు 300 మీటర్ల రోడ్డు వెడల్పు వరకు 12 ఆస్తులు మొత్తం 42 ఆస్తుల సేకరణ కు కమిటీ ఆమోదం.
17. హబీబ్ నగర్ నుండి రియ సాత్ నగర్ వరకు జంక్షన్ వరకు ప్రతిపాదిత 40 ఫీట్ల రహదారి వెడల్పు కోసం రూ. 270  లక్షల వ్యయంతో పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం.
18.  లిటిల్ బర్డ్  స్కూల్ ఎదురుగా ఉన్న రోడ్డు బండ్లగూడ నుండి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్  శ్రీశైలం హైవే మెయిన్ రోడ్డు వరకు 12 & 18 మీటర్ల రోడ్డు వెడల్పు పని కొరకు  137  ఆస్తుల సేకరణ కోసం కమిటీ ఆమోదం.

Related posts