telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాబూల్‌ : .. తీవ్రవాద శిబిరాలపై .. ఆర్మీ డ్రోన్ దాడి.. 30మంది మృతి..

army drone attack costs 30 labor

అఫ్ఘాన్‌ సైన్యం తీవ్రవాద శిబిరాలుగా భావించి జరిపిన డ్రోన్‌ దాడిలో 30 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అఫ్ఘాన్‌ సైనికాధికారులు తెలిపిన వివరాల ప్రకారం… నాన్‌గర్హార్‌ ప్రావిన్స్‌లోని ఓ వ్యవసాయం క్షేత్రంలో టెంటు వద్ద కొద్దిమంది గుమిగూడి ఉన్నారు. ఈ టెంట్‌లో ఉన్నవారంతా మిలిటెంట్లని అఫ్ఘాన్‌ ఆర్మీ అనుమానించింది. క్షణం ఆలోచించకుండా ఆ టెంట్‌పై డ్రోన్‌ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 30మంది వ్యవ సాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై గవర్నర్‌ కార్యాలయం అధికార ప్రతినిధి అత్తావుల్లా ఖోగ్యానీ, నాన్‌ఘర్‌ ప్రావిన్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు సొహ్రబ్‌ ఖాదెరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సాను భూతి వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు విఘా తమే ప్రధాన కారణం : అఫ్ఘాన్‌లో చెలరేగిన అంతర్యుద్ధానికి తెరదించాలనే లక్ష్యంతో తాలిబన్‌ ప్రతినిధులకు, అఫ్ఘాన్‌, అమెరికా అధికారుల మధ్య జరిగిన చర్చలు అర్థాంతరంగా నిలిచిపోయాయి.

ఓవైపు చర్చల్లో పాల్గొంటూనే మరోపక్క అఫ్ఘాన్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న తాలిబన్ల తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ఘటనలో అమెరికా సైనికాధికారిని తాలిబన్లు హతమార్చడాన్ని సీరియస్‌గా తీసుకుంది. శాంతిచర్చల నుంచి వైదొలిగింది. అయితే, తాలిబన్ల ఏరివేతే తన ముందున్న ఏకైక లక్ష్యమని అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన అఫ్ఘాన్‌లో మరింత ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తోంది. తాలిబన్లు తమ ఉనికి కోసం పాకులాడుతున్నారు. భద్రతా బలగాలను, సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు.

Related posts