telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆర్బిటర్ పనిచేస్తుంది.. విక్రమ్ పై ఆశలు లేనట్టే .. : ఇస్రో

indians support to isro on chandrayan-2

చంద్రుని కక్ష్యలో ఆర్బిటర్ సాధారణంగానే పని చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా ఇస్రో ప్రకటన విడుదల చేసింది. ‘చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ కక్ష్యలో సక్రమంగానే పనిచేస్తోంది. పేలోడర్స్‌ కూడా బాగానే పనిచేస్తున్నాయి. అయినప్పటికీ విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు కలవకపోవడానికి గల కారణాలను జాతీయ స్థాయి కమిటీతో పాటు ఇస్రో నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు’ అని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే చంద్రుడిపై ఉన్న ల్యాండర్‌ విక్రమ్‌ ఫొటోలు తీసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నించింది.

నాసా లూనార్‌ ఆర్బిటర్‌ తీసిన చిత్రాల్లో విక్రమ్‌ కనిపించిందా లేదా అనే విషయంపై పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 7న చంద్రయాన్‌-2కు చెందిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగే సమయంలో భూకేంద్రం నుంచి సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అనంతరం ల్యాండర్‌తో సంబంధాల పునరుద్దరణకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆఖరిగా నాసా కూడా ఏమి చేయలేకపోవడంతో, ఇస్రో తరువాతి ప్రయోగానికి సిద్ధం అవుతుంది.

Related posts