telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిరుద్యోగులకు ఉపాసన ఆఫర్… కానీ ఈసారి…!

Upasana

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యం దగ్గరి నుంచి, తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, భర్త రామ్‌చరణ్‌కు సంబంధించిన విషయాలు.. సినీ విశేషాలు చెబుతూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. యోగా, హెల్త్ టిప్స్ చెబుతూ ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో చెబుతారు. ఫిట్‌నెస్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటారు. అపోలో లైఫ్ సంస్థ అధినేతగా ఉన్న ఆమె.. యూట్యూబ్ వేదికగా ఫిట్‌నెస్ సలహాలు ఇస్తూ ఫేమస్ అయ్యారు. అలా లక్షలాది ఫాలోయర్లను సంపాదించుకున్నారు. అయితే.. ఎక్కువగా సోషల్ మీడియానే నమ్ముకున్న ఆమె.. ఇప్పుడు నిరుద్యోగులకు మంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే తనకు సంబందించిన మీడియా, హెల్త్ కేర్‌ కంపెనీలో కంటెంట్ రైటర్స్‌తో పాటు గ్రాఫిక డిజైనర్స్, వీడియో ఎడిటర్స్‌కు సంబంధించిన ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ బుధవారం మాత్రం డైటీషియన్స్, నూట్రిషియన్స్ కావాలంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రకటన ఇచ్చింది మెగా కోడలు. అంతేకాదు ఈ పోస్ట్ కావాలనుకునే వాళ్లకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చింది. తగిన అర్హతలు ఆసక్తిగల అభ్యర్ధులు తమకు సంబంధించిన పూర్తి వివరాలను పంపే ఈ మెయిల్ చిరునామాను కూడా పంపించింది. అర్హతలు కలిగిన వారు ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి.

Related posts