గత ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ మోడీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న విషయం తెల్సిందే. అయితే ఇటీవలే ఆయన ఆ పార్టీ నుండి బయటకు వచ్చి, జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే కూటమే అధికారంలోకొస్తుందని, మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపడతారని అభిప్రాయపడ్డారు.
నితీశ్ కుమార్ ఎన్డీయే లో ఒక పెద్ద నేత, బీహార్ ని పదిహేనేళ్ల పాటు పాలించిన ఘనత ఉన్న నాయకుడు ఆయన అని, అయితే, ప్రధాని స్థానంలో ఇప్పుడే ఆయన్ని ఊహించుకోలేమని వ్యాఖ్యానించారు. బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోయినా, నితీశ్ అభ్యర్థిత్వం సాధ్యపడకపోవచ్చని అన్నారు.
నన్ను బీజేపీ, టీడీపీలు కరివేపాకులా వాడుకున్నాయి: పవన్