telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హృతిక్ తన సోదరిని హింసిస్తున్నాడు… కంగనా సోదరి వ్యాఖ్యలు

Hrithik-and-Rangoli

ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరి మధ్య చెలరేగుతున్న వైరం ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదు. తాజాగా కంగ‌నా సోద‌రి రంగోలి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా హృతిక్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హృతిక్ సోదరి సునైనాని కుటుంబీకులు చిత్ర హింస‌లు పెడుతున్నారని, ఆమె ముస్లింకి చెందిన వ్య‌క్తితో ప్రేమ‌లో ఉండ‌గా, అది ఇంట్లో వారికి న‌చ్చ‌లేదని, అందుకే గ‌త వారం ఓ మ‌హిళా పోలీసుని ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇప్పించారని, ఆ పోలీసు సునైనాపై చేయి కూడా చేసుకుంద‌ని ఈ ట్వీట్ లో తెలిపింది రంగోలి. “హృతిక్ తండ్రి రాకేష్ రోష‌న్ కూడా సునైనాని కొట్టార‌ట‌. జైలుకి కూడా పంపించాల‌ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నార‌ట‌. సునైనాకి హృతిక్ ఫ్యామిలీ నుండి ఆప‌ద పొంచి ఉంది. అందుకే కంగ‌నాకి కాల్ చేసి సాయం చేయ‌మ‌ని అడుగుతుంది. ఎలా సాయం చేయాలో కంగ‌నాకి అర్ధం కావ‌డం లేదు. ఈ విష‌యం అంద‌రికి తెలియాల‌నే ఈ విషయాలన్నీ ట్విటర్‌ వేదికగా బయటపెడుతున్నాను. ఎవరినైనా ప్రేమించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కనీసం ఈ ట్వీట్లు చూసైనా రోషన్‌ కుటుంబం వెనక్కు తగ్గి సునైనా ప్రేమను అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది రంగోలి. ఒక ట్వీట్‌లో కంగ‌నా.. సునైన నెంబ‌ర్‌ని బ్లాక్ చేసింద‌ని చెప్పుకొచ్చింది. అయితే సునైనా త‌న ట్విట్ట‌ర్‌లో త‌మ ఫ్యామిలీదే త‌ప్పు అన్న‌ట్టు కంగ‌నాకి త‌న మ‌ద్ద‌తు తెలపడమే కాకుండా… న‌ర‌కంలో ఉన్న‌ట్టుగా ఉందంటూ అనడం గమనార్హం. మరి ఈ విషయంపై హృతిక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related posts