telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ : .. మరో బహిరంగ హత్య.. ఈసారి నల్గొండలో..

another public murder in telangana

తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ హత్యలు ఎక్కువ అవుతున్నాయి. దానిని బట్టే చెప్పాలి, ఆ రాష్ట్రంలో భద్రత ఎలా ఉంది అనేది. తాజాగా, మరో బహిరంగ హత్య, నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పాత కక్షలతో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడిని హతమార్చి అనంతరం నరికిన తలతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడో వ్యక్తి. నాంపల్లి మండలం నేరేళ్లపల్లికి చెందిన సద్దాం స్థానికంగా ఉండే ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, సద్దామే హత్య చేశాడని భావించిన ఆమె సోదరుడు గౌస్‌ అతన్ని చంపాలని కుట్ర పన్నాడు. స్నేహితుడు ఇమ్రాన్‌తో కలిసి సద్దాంను అత్యంత దారుణంగా హతమార్చాడు. హత్య అనంతరం సద్దాం తలని సంచిలో వేసుకుని పోలీసులకు లొంగిపోయాడు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Related posts