కరివేపాకు తినడానికి గొంతులో పట్టదు కానీ, ఏకంగా పెద్దపెద్ద వస్తువులు మింగేశాడు ఓ ప్రబుద్దుడు. మింగి ఎన్నాళ్ళైందోగాని, కడుపునొప్పితో ఆస్పత్రి లో చేరాడు ఆ యువకుడు. ఆయన పొట్టలో 33 రకాల వస్తువులను వైద్యులు గుర్తించారు. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శస్త్రచికిత్స చేసి పొట్టలోని వస్తువులను వైద్యులు తొలగించారు. ఛతర్‌పుర్ జిల్లా బుందేల్‌ఖండ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో యోగిత్ సింగ్ (30) అనే యువకుడు కడుపు నొప్పితో చేరాడు.
బాధితుడికి సాధారణ కడుపునొప్పి అని తొలుత భావించిన వైద్యులు.. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆశ్చర్యపోయారు. పొట్టలో పెన్ను, పెన్సిల్, ఇనుప ముక్కలు సహా మొత్తం 33 రకాల వస్తువులు శస్త్రచికిత్సలో బయటపడ్డాయి. మానస్థిక స్థితి సరిగా లేని కారణంగా ఈ వస్తువులను అతడు మింగినట్లు వైద్యులు తెలిపారు. తాను ఇవన్నీ మింగిన విషయాన్ని బాధితుడు కుటుంబ సభ్యులకు తెలిపినా వారు తొలుత నమ్మకపోవడం గమనార్హం. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా