telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

గోళ్ళు కోరికే అలవాటు ఉందా.. అయితే మీ పని మాటాష్ !

మనలో చాలా మందికి గోళ్ళు కోరికే అలవాటు ఉంటుంది. దీనికి చిన్న, పెద్ద అనే తేడానే లేదు. ఇలా గోళ్ళు కోరుకకూడదని తెలిసినా అదే పని చేస్తూ ఉంటారు. ఎవరెన్ని చెప్పినా వినరు. అదే కదా మనిషి నైజం. గోళ్ళు కోరుకుతే చాలా అరిష్టమనీ మన పెద్ద వాళ్ళు చెబుతారు. అయితే గోళ్ళు కొరుకడం వల్ల వాటి చివరి నుంచి ప్రతికూల శక్తి బయటకి వెళుతుంది. వాటిని నోటిలో పెట్టి కొరకటం వల్ల ఆ ప్రతికూల శక్తి తిరిగి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు మనం ఎంత శుభ్రం చేసిన గోళ్లలో మట్టి, సూక్ష్మ క్రిములు ఉంటాయి. ఇవి మన బాడీలోకి పోతాయి. దీంతో మనకు అనారోగ్యాలు వస్తాయి. ఇక ఇది చిన్న పిల్లల్లో మరీ ఎక్కువే. చిన్న పిల్లలు గోళ్ళు కొరికి మింగే పరిస్థితులు ఉన్నాయి. దాని ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
గోళ్లను కొరకడం బ్యాడ్ హాబిట్ మాత్రమే కాదు… అనారోగ్యానికి కూడా కారణమే. ఎందుకంటే గోళ్లల్లో ఉండే బ్యాక్టీరియా, క్రిములు వేళ్ళ ద్వారా నోటిలోకి వెళతాయి. ఆ క్రిములు బాడీ లోకి పోవటం వల్ల కడుపు, పేగు ఇన్ ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చు. అలాగే వేళ్ళ చివరి చర్మం దెబ్బతినడమే కాకుండా కణజాలం డ్యామేజ్ అవుతుంది. ఈ సమస్య ఏర్పడినపుడు గోళ్ళ చుట్టూ పుండ్లు కూడా అవుతాయి. అలాగే గోళ్ళు కోరికే అలవాటు ఉన్న వారికి ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. గోళ్ళు కొరుకడం సాద్యమైనంత త్వరగా ఆపేయండి.

Related posts