telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ… ?

కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 948231 కు చేరింది. ఇందులో 905266 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 35592 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 20 మంది మృతి చెందారు.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ పెట్టే ఆలోచన చేస్తోంది జగన్ ప్రభుత్వం. రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే… కరోనా కేసులను అరికట్టవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. లాక్ డౌన్ లో అమలు చేసిన కఠిన నిబంధనలను అమలు చేయాలనీ జగన్ సర్కార్ యోచిస్తోంది. అలాగే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల మూసివేతపై కూడానిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. అటు పదో తరగతి పరీక్షలను రద్దు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది జగన్ ప్రభుత్వం. అయితే జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. 

Related posts