telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనసూయకు మెగా ఆఫర్ల వెల్లువ

Anasuya

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు వరుస మెగా ఆఫర్లు వచ్చి పడుతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ జగర్లమూడి దర్శకత్వంలో పవన్ ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఆమె పాత్ర అరగంట సేపే ఉన్నప్పటికీ సినిమాకు చాలా కీలకం అని ఫిలిం వర్గాల సమాచారం. అనసూయ కోసం ఓ పాటను కూడా యాడ్ చేయబోతున్నారట. ఇందులో పవన్ పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ‘పింక్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు కూడా లీకైపోతున్నాయి. మరోపక్క బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో అనసూయ విలన్ పాత్రలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts