telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వకీల్ సాబ్” టీజర్ ఆ రోజునే… !!?

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తుడటంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీకి కరోనా అడ్డంకిగా మారడంతో అప్డేట్స్ సైతం ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచేందుకు సర్ ప్రైజ్‌కి ప్లాన్ చేసిందట. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. 50 రోజుల ముందుగానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ట్విట్టర్ వేదికగా ప్రారంభం కావడంతో పవన్ బర్త్ డేతో పాటు ‘వకీల్ సాబ్’‌ కూడా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ మూవీ టీజర్ విడుదల చేసేందుకు ఆయన బర్త్ డేనే కరెక్ట్ అని భావించిన మేకర్స్ సెప్టెంబర్ 2 న వకీల్ సాబ్ టీజర్‌ను విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ విడుదల విషయానికి వస్తే.. వాస్తవానికి ఈ సినిమాను మే 15న విడుదల చేయాలనుకున్నారు. కాని లాక్ డౌన్ కారణంగా సాధ్యం కాలేదు. ఇక నెక్స్ట్ ఆగష్టు 15 అయితే ‘వకీల్ సాబ్’కి బిగ్ రిలీజ్ అవుతుందని భావించారు. అయితే కరోనా విజృంభించడంతో షూటింగ్‌ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ‘వకీల్ సాబ్’ విడుదలకు సమయం పట్టేట్టుగా ఉంది.

Related posts