telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియా దగ్గర ఉన్న సుశాంత్ ఆస్తి ఇది మాత్రమేనట…!?

Sushant

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆత్మహత్యగా ధృవీకరించబడిన ఈ కేసు విచారణలో భాగంగా సుశాంత్‌తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరినీ విచారిస్తూ అతని ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలపై కీలక సమాచారం రాబడుతోంది పోలీస్ యంత్రాంగం. ఇటీవలే కేసు దర్యాపును వేగవంతం చేసి సీబీఐకి అప్పగించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. శుక్రవారం రోజు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని 9 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని హీరోయిన్ రియా చక్రవర్తి తెలిపింది. రియా నోట్‌బుక్‌లో సుశాంత్ గతంలో రాసిన `నోట్ ఆఫ్ గ్రాటిట్యూడ్` (కృతజ్ఞతల జాబితా) పేజీని రియా లాయర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో తన జీవితానికి, రియా కుటుంబ సభ్యులకు సుశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ నోట్ ప్రకారం లిల్లు, బెబు, సర్, మేడమ్, ఫుడ్జ్ మొదలైన వారికి సుశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ పేర్ల గురించి రియా స్పష్టత ఇస్తూ.. `లిల్లు అంటే షోవిక్ (రియా సోదరుడు), బేబో అంటే నేను, సర్ అంటే మా నాన్న, మేడమ్ అంటే మా అమ్మ` అని పేర్కొంది. అలాగే `చిచ్చోరే` అని రాసి ఉన్న సుశాంత్‌కు సంబంధించిన బాటిల్ ఫొటోను కూడా షేర్ చేశారు. ఇవి, తప్ప సుశాంత్‌కు సంబంధించిన ప్రాపర్టీ ఏదీ తన వద్ద లేదని రియా తెలిపింది.

Related posts