telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పూర్తిగా కోలుకున్నా..ఎలాంటి సింప్టమ్స్ లేవు: మంత్రి మల్లారెడ్డి

Mallareddy Trs

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. గత ఆదివారం నాడు కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలిందని మల్లారెడ్డి చెప్పారు. అప్పటి నుంచి తాను సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నానని వెల్లడించారు.

ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని, ఇప్పుడు తనకు ఎలాంటి సింప్టమ్స్ లేవని చెప్పారు. మెడిసిన్ తీసుకుంటూ ధైర్యంగా ఉంటే కరోనా నుంచి కోలుకోవచ్చని తెలిపారు. అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహిస్తూ కరోనా సోకకుండా చూసుకోవాలని సూచించారు.

Related posts