telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చైనాలో భారతీయులకు.. కరోనా వైరస్..

new virus attacked in china 41 died

చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వంద సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల చైనాలోని ఓ భారతీయ టీచర్ కి కూడా ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక్టీరియా… తాజాగా సౌదీకీ పాకింది. సౌదీలో భారతీయ నర్సుకు కరోనా వైరస్​ సోకినట్లు, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్​ తెలిపారు. జెడ్డాలోని ఆల్‌హయత్‌ హాస్పిటల్ లో పనిచేస్తున్న కేరళకు చెందిన 100 మంది నర్స్‌లను పరీక్షించగా….ఒకరికి ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ట్రీట్మెంట్ పొందుతున్న బాధిత నర్సు.. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు కేంద్ర మంత్రి గురువారం ఓ ట్వీట్ లో తెలిపారు.

సౌదీ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) మాత్రం ఇప్పటివరకు కరోనావైరస్ కేసులు లేవని చెబుతోంది. అసీర్ రీజియన్ సైంటిఫిక్ రీజినల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ చైర్మన్ డాక్టర్ తారిక్ అల్ అజ్రాకి మాట్లాడుతూ…. అసీర్ నేషనల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఇండియన్ నర్సుకి సోకింది ప్రస్తుతం వూహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కాదని ఆమెకు సోకింది వేరే వైరస్ అని తెలిపారు. ఈ వ్యాధి తమ దేశ ప్రజలకు సోకకుండా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ కూడా ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా తగు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా చైనా,హాంకాంగ్ నుంచి వచ్చే ప్యాసింజర్లను స్క్రీన్ చేయాలని,వాళ్లు వైరస్ బారిన పడలేదని తెలిసిన తర్వాతనే వాళ్లను బయటకు పంపాలని దేశంలోని ఏడు విమానాశ్రయాలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటివరకూ 60 విమానాలకు చెందిన దాదాపు 13 వేల మందిని స్క్రీనింగ్‌చేయగా వారిలో ఏ ఒక్కరికీ వైరస్‌ సోకలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Related posts