telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రెచ్చిపోయిన కారు యజమాని.. హారన్‌ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్‌ పై దాడి

metro slashed RTC in hyderabad

ఆర్టీసీ డ్రైవర్‌ హారన్‌ కొట్టాడని ఓ కారు యజమాని రెచ్చిపోయాడు. బస్సులోకి ఎక్కి సీటుపై ఉన్నఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదాడు.ఈ ఘటన హైద్రాబాద్ ఐఎస్‌సదన్‌ చౌరస్తాలో జరిగింది. మిదానీ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ ఆంజనేయులు బస్సు ముందు ఉన్న కారును పక్కకు వెళ్లమంటూ పలుమార్లు హారన్‌ కొట్టాడు.

దీంతో రెచ్చిపోయిన కారు యాజమాని బస్సులోకి వచ్చి సీటుపై ఉన్న డ్రైవర్‌పై దాడి చేశాడు. వారించిన పలువురు ప్రయాణికులపైనా దాడి చేశాడు. తర్వాత కారులో ఉడాయించాడు. ఈ సంఘటనపై బస్సు డ్రైవర్‌ సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు నెంబర్‌ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు.

Related posts