telugu navyamedia
ఆంధ్ర వార్తలు ఆరోగ్యం రాజకీయ వార్తలు

మండిలిపై .. నోరు విప్పిన ఛైర్మెన్ షరీఫ్..

ap sasana mandali no bill move forward

తొలిసారిగా షరీఫ్ వికేంద్రకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంపై నోరు విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తనను కలిసిన విలేకరులతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకీ పంపించడం, మంత్రులు దుర్భాషలాడారంటూ వచ్చిన వార్తలు, మూడు రాజధానుల ఏర్పాటు, మండలిని రద్దు చేస్తారంటూ వెల్లువెత్తుతోన్న కథనాలపైనా షరీఫ్ స్పందించారు. వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించిన ప్రక్రియ కొంత మధ్యలోనే మిగలిపోయిందని, దాన్ని పూర్తి చేయాల్సి ఉందని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఆ ఉద్దేశంతోనే తాను సెలెక్ట్ కమిటీకి పంపించాల్సి వచ్చిందని అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపించడానికి తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రక్రియ.. నిబంధనలకు లోబడి లేదని, అందుకే దాన్ని తన విచక్షణాధికారాలను వినియోగించాల్సి వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఛైర్మన్ స్థానం నుంచే వెల్లడించారు.

మంత్రులు దుర్భాషలాడారంటూ వచ్చిన వార్తలపై షరీఫ్ స్పందించారు. మంత్రులు ఆవేశంలో దుర్భాషలాడి ఉండొచ్చని అన్నారు. ఆవేశంలో చాలా అంటుంటారని.. వాటిని పట్టించుకోవాల్సి అవసరం లేదని కొట్టి పారేశారు. తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదనీ షరీఫ్ స్పష్టం చేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా కొమ్ము కాయాల్సిన అవసరం తనకు లేదని, నిబంధనల ప్రకారమే తన విధులను నిర్వర్తించానని అన్నారు. మంత్రులు దుర్భాషలాడారంటూ వచ్చిన వార్తలపై షరీఫ్ స్పందించారు. మంత్రులు ఆవేశంలో దుర్భాషలాడి ఉండొచ్చని అన్నారు. ఆవేశంలో చాలా అంటుంటారని.. వాటిని పట్టించుకోవాల్సి అవసరం లేదని కొట్టి పారేశారు. తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదనీ షరీఫ్ స్పష్టం చేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా కొమ్ము కాయాల్సిన అవసరం తనకు లేదని, నిబంధనల ప్రకారమే తన విధులను నిర్వర్తించానని అన్నారు.

Related posts