తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోగా ఎదుగుతున్న నటుడు నవీన్ పోలిసెట్టి. షార్ట్ ఫిల్మ్‌స్, యూట్యూబ్ వీడియోలతో తన టాలెంట్ చూపించుకున్నాడు. తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరోగా అరంగేట్రం చేశాడు. తన తొలిసినిమాతోనే అందరికి తన ప్రతిభను కనబరిచాడు. ప్రస్తుతం నవీన్ మరో సినిమా చేశాడు. దాని పేరు ‘జాతిరత్నాలు’. మొదటి సినిమాలో తప్పు చేసిన వారిని పట్టించే డిటెక్టివ్‌గా కనిపించిన నవీన్ ఈ సినిమాలో తానే ఓ దొంగగా కనిపించాడు. ఈ సినిమాలో జోగిపేట శ్రీకాంత్ అనే పాత్రలో నవీన్ కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా నుండి ఇంతకముందుకు విడుదలైన జాతిరాత్నాలు టీజర్ మంచి రెస్పాన్స్ దకించుకుంది. ఈ నెల 19న ఈ సినిమా నుండి మరో లిరికల్ పాట విడుదల కానుంది. అయితే రధన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అయితే అయితే ‘మహానటి’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నిర్మాతగా మారారు. స్వప్న సినిమాతో కలిసి,ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.
previous post
next post