telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాజీ ప్రియుడికి అనుష్క చురకలు

Anushka Sharma on Movie Retirement

బాలీవుడ్ లో అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్ లు క్రేజీ సెలబ్రిటీ దంపతులు అన్న విషయం తెలిసిందే. కాగా ఎల్ అవార్డ్స్ షోలో రణ్‌వీర్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీని అందుకున్నారు. అనుష్కకు ఎల్ ఇంపాక్ట్ ట్రోఫీ దక్కింది. బాలీవుడ్ నటులు కరీనా కపూర్, జాన్వి కపూర్, తారా సుతారియా, అనన్య పాండే, మానుషీ చిల్లార్ తదితరులు ఈ అవార్డ్స్‌ షోలో పాల్గొని సందడి చేశారు. ఎల్ బ్రాండ్‌కు అనుష్క ఎప్పటినుంచో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా రణ్‌వీర్ హైపర్ యాక్టివ్‌నెస్ తట్టుకోలేక అనుష్కకు కోపం వచ్చినట్లుంది. ఇటీవల ముంబయిలో ఎల్ బ్యూటీ అవార్డ్స్ జరిగాయి. ఈ సందర్భంగా అనుష్క తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో రణ్‌వీర్ అక్కడే ఉన్న మైక్ తీసుకుని హోస్ట్‌లాగా పోజ్ కొడుతూ అనుష్కను ఓ ప్రశ్న అడిగాడు. ‘సక్సెస్ అంటే ఏంటో బ్యూటిఫుల్ నటి అనుష్క శర్మను అడిగి తెలుసుకుందాం’ అని మైక్‌ను ఆమె ముందు పెట్టాడు. దీంతో ‘రణ్‌వీర్ నువ్వు హోస్ట్ వి కావు. వెళ్లి కూర్చో’ అనేసింది. ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా తీసుకునే రణ్‌వీర్‌కు అనుష్క అలా అనేసరికి కోపం వచ్చినట్లుంది. ‘ఓకే సారీ సారీ’ అనుకుంటూ మైక్ అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా… గతంలో రణవీర్ సింగ్, అనుష్క డేటింగ్ చేసిన విషయం విదితమే. ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమా తర్వాత రణ్‌వీర్, అనుష్కల రిలేషన్‌షిప్‌ను చూసి కచ్చితంగా వారిద్దరూ పెళ్లి చేసుకుంటారనే అనుకున్నారంతా. కానీ ఏం జరిగిందో తెలీదు కానీ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత రణ్‌వీర్.. దీపిక పదుకొణెను ప్రేమించాడు. అనుష్క.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇష్టపడింది. అయితే రణ్‌వీర్, దీపికల వెడ్డింగ్ రిసెప్షన్‌కు అనుష్క కూడా వెళ్లారు.

Related posts