telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కాకినాడలో లీకైన విషవాయువు.. భయంతో స్థానికుల పరుగులు

gas leakage company

కాకినాడలోని ఆటోనగర్ శివారులో విషవాయువు లీకై తీవ్ర దుర్గంధం వెలువడడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వాయువు వాసనతో ఇబ్బందిపడ్డ స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు లారీ డ్రైవర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను అప్రమత్తం చేశారు. 

పరిశ్రమలశాఖ అధికారులు నమూనాలు సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.లీకైన వాయువును ప్రాథమికంగా ప్రమాదకరమైన అమోనియాగా గుర్తించారు. గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలతో నిండిన పది డ్రమ్ములను విడిచిపెట్టారని, వాటి నుంచే విష వాయువులు వ్యాపించాయని పోలీసులు తెలిపారు.

ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వాయువులపై నీళ్లు చల్లడంతో వాయువు గాఢత తగ్గింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘాతంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts