telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దిల్లీ : … మరో వారంలో .. కాలుష్యం తగ్గనుందట..

public health emergency in delhi

దిల్లీ ప్రజలకు మరో వారంలో కాస్త ఊరట లభించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. గాలులు బలంగా వీస్తుండడంతో పవన నాణ్యత కాస్త మెరుగైనట్లు తెలిపింది. నవంబర్‌ 26 వరకు ఈ గాలులు కొనసాగుతాయని అంచనా వేసింది. దీంతో ప్రస్తుతం ‘వెరీ పూర్‌’ స్థాయిలో ఉన్న గాలి నాణ్యత వచ్చే వారం ‘పూర్‌’ స్థాయికి చేరుకోవచ్చని అభిప్రాయపడింది. శనివారం దిల్లీలో పవన నాణ్యతా సూచీ(ఏక్యూఐ) 312గా నమోదైంది. ఆదివారం గాలి వేగం గంటకు 20కి.మీగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ చీఫ్‌ కుల్‌దీప్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వేగం కాలుష్య కారకాలను నగరం నుంచి పారదోలడానికి సరిపోతుందన్నారు. శనివారం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘పూర్‌’ స్థాయికి చేరిందని.. ఆదివారం కల్లా నగరవ్యాప్తంగా పరిస్థితి మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు.

కోతల సమయం ముగిస్తుండడంతో పంట వ్యర్థాల దహనం కూడా తగ్గి గాలి నాణ్యత పెరుగుతందని తెలిపారు. ఆదివారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 253గా నమోదైంది. గత కొన్ని రోజులుగా దిల్లీ ప్రజలు తీవ్ర వాయుకాలుష్యం గుప్పిట్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. శీతాకాలం కావడంతో తేమకు తోడు పంట వ్యర్థాల దహనానికి సంబంధించిన కాలుష్య కారకాలు దిల్లీకి చేరడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వాదోపవాదాలు కూడా నడుస్తున్నాయి. లోక్‌సభలోనూ దీనిపై చర్చ జరిగింది.

Related posts