ఆంధ్రా యూనివర్సిటీలోని కొన్ని పీజీ పరీక్షల తేదీలను మార్పుచేసినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను ఈ నెల 11వ నుంచి నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎమ్మెస్సీ అప్లయిడ్ కెమిస్త్రీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు మినహా ఇతర పరీక్షల తేదీలను మార్పు చేశామన్నారు. పైన పేర్కొన్న నాలుగు కోర్సుల పరీక్షలు యథాతథంగా ఈనెల 4 నుంచి జరుగుతాయని చెప్పారు. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వీసీ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు.
previous post
next post