telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పెద్దల సభకు .. మోహన్ బాబును సిద్ధం చేస్తున్న వైసీపీ..

ycp-mohanbabu

మోహన్ బాబు సినీ పరిశ్రమలో విలన్ నుంచి తన కెరీర్ మొదలుపెట్టి సూపర్ స్టార్ వరకూ ఒక్కో మెట్టూ ఎక్కి టాలీవుడ్ కి ఒక బిగ్ ఇన్స్పిరేషన్ గా చెప్పుకుంటారు. మోహన్ బాబు సినిమా రంగంలోనే కాకుండా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మరీ ప్రజలకు సేవ కూడా చేస్తున్నారు. అలాగే ఆయన రాజకీయల్లో కూడా ఎప్పటికపుడు తన వంతు పాత్ర పోషిస్తూ వస్తున్నారు. మొదట్లో అన్న నందమూరి తారకరామారావు వెంట నడిచారు. టీడీపీలో అన్న గారే మోహన్ బాబుకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆ తరువాత చంద్రబాబుకు కూడా మోహన్ బాబు మద్దతు ఇచ్చారు కానీ ఎక్కువ కాలం వీరి బంధం కొనసాగలేదు. మధ్యలో బీజేపీ లోకి వెళ్ళినా చాలాకాలంగా మోహన్ బాబు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

2019 ఎన్నికల్లో మోహన్ బాబు జగన్ కి మద్దతు ప్రకటించి తన వంతుగా వైసీపీ విజయానికి ప్రచారం కూడా చేశారు. జగన్ కి మోహన్ బాబు బంధువు అవుతారు కూడా. జగన్ కజిన్ సిస్టర్ నే మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు చేసుకున్నారు. ఆ విధంగా సన్నిహిత సంబంధాలు ఉన్న నేపధ్యంలో జగన్ మోహన్ బాబుకు ఏ పదవి ఇస్తారన్న చర్చ ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. మోహన్ బాబు స్థాయి, హోదా పెద్దరికానికి తగినట్లుగా పెద్దల సభకు ఆయన్ని పంపిస్తారని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చిలో పెద్ద ఎత్తున ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. దాంతో ఆ సీట్లలో ఒక దానికి మోహన్ బాబుని సెలెక్ట్ చేయడానికి జగన్ నిర్ణయించారని అంటున్నారు. అంటే మోహన్ బాబుకి ఎంపీ సీటు జగన్ రిజర్వ్ చేసిపెట్టారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

Related posts