telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ కు పాక్ సహాయం…

india pakistan

ప్రస్తుతం భారత్ లో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె భారత్-పాక్ బద్ధ శత్రువులు అనే విషయం అందరికి తెలుసు . కానీ కరోనా కాలంలో పాక్ కు ఇండియా మెడిసిన్స్, వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన సంగతితెలిసిందే . కాగా ఇప్పుడు ఇండియాలో కరోనా మహమ్మారి రెండో వేవ్ ఉధృతంగా ఉన్నది. దీంతో ఇండియాకు సహాయం చేసేందుకు పాక్ ముందుకు వచ్చింది. వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్ రే యంత్రాలు, పీపీఈ కిట్లు అందిస్తామని పాక్ పేర్కొన్నది. ఈ విషయాన్నీ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. రెండు దేశాల అధికారులు ఈ విషయంలో చొరవ చూపించాలని, గొడవలు పక్కన పెట్టి మానవతావాదంతో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ పేర్కొన్నది. చుడాలిమరి దీని పై మన భారత్ ఎలా స్పందిస్తుంది అనేది.

Related posts