తెలంగాణ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ ఎమెరిటస్ పోస్టుల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌వర్సిటీ అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. టీచింగ్ రంగంలో ఆసక్తి కలిగి, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఐదేండ్ల బోధన అనుభవంతో పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్లు ఈ పోస్టులకు అర్హులని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
గౌరవ వేతనం ప్రాతిపదికన చేపట్టనున్న నియామకాలకు గరిష్ఠంగా 70 ఏండ్ల వయ స్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను రిజిస్ట్రార్, కాళోజీ హెల్త్‌వర్సిటీ వరంగల్ కార్యాలయానికి ఫిబ్రవరి 17వ తేదీలోగా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలని సూచించారు. పూర్తి సమాచారానికి www. knruhs.telangana.gov.in సంప్రదించాలని తెలిపారు.