telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

డీప్ కోమాలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

Pranabh mukarji corona

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెదడులో రక్తం గడ్డకట్టడంతో కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా వైరస్ కూడా సోకడంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ప్రణబ్ ఆరోగ్యంపై బులెటిన్ ను ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసారు. ఆయన ఇంకా డీప్ కోమాలో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని, మూత్రపిండాలు కూడా పని చేయడం లేదని వివరించారు. ఆయన ఆరోగ్యం క్షిణిస్తోందని వైద్యులు తెలిపారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారని వైద్యులు తెలిపారు. కాగా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖులు కోరుకుంటున్నారు. ప్రణబ్ కుమార్ ముఖర్జీ భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించాడు. రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అతను భారత జాతీయ కాంగ్రెస్లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రి పదవులను నిర్వహించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటూంటాయి.

Related posts