telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో క్రమంగా పెరుగుతున్న పాజిటివిటి రేటు…

ఏపీలో ఈరోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు అలాగే దాదాపు 100 మరణాలు నమోదవుతున్నాయి. అయితే కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో నిన్నటి రోజున కేసులు 3 వేలకు పైగా నమోదయ్యాయి. మొదటిసారి కేసులు 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పాజిటివిటి రేటు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయబోతుందా అంటే అవుననే విధంగా ఉన్నాయి ప్రస్తుతం గణాంకాలు. కేసులు ఇదే విధంగా పెరిగితే లాక్ డౌన్ విధించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చూడాలి మరి రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ విధిస్తారా… లేదా అనేది.

Related posts