telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మంగళగిరిలో .. కోట్ల భూదందా..

YCP MLA RK comments Minister Lokesh

లింగమనేనిపై వైసీపీ కీలక వ్యాఖ్యలు చేసింది. బాబు హయాంలో జరిగిన భూబాగోతంపై విచారణ షురూ అవుతుందని ఎమ్మెల్యే ఆర్కే ద్వారా సిగ్నల్‌ ఇచ్చింది జగన్‌ ప్రభుత్వం. ప్రజావేదిక ఎపిసోడ్‌ ముగిసింది. నోటీసులు, సమాధానాలు అంటూ చట్టపరంగా ముందుకెళ్లిన ప్రభుత్వం మళ్లీ దూకుడు పెంచబోతోంది. చంద్రబాబు ఉంటున్న నివాసం లింగమనేనిది కావడంతో.. టార్గెట్‌ చేసింది. చంద్రబాబు, లింగమనేని మధ్య పరోక్షంగా బోలెడు లావాదేవీలు జరిగాయని ఆరోపించడం మొదలుపెట్టింది. ఈ విషయాల్లో ముందు నుంచి దూకుడుగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి లింగమనేనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. లింగమనేని 40 ఎకరాల్లో లే ఔట్లు వేసి..విలాసవంతమైన విల్లాలు కట్టారని ఆర్కే ఆరోపించారు. 2005-06 నుంచి విల్లాలు నిర్మించి ఒక్కొక్క విల్లాను రూ.5 కోట్లకు అమ్ముకుని, లే ఔట్ ఫీజులు చెల్లించలేదని అన్నారు. ఆ కట్టడాలకు సంబంధించిన బిల్డింగ్ పర్మిట్, గ్రామ పంచాయతికి కట్టాల్సిన లే ఔట్ ఫీజు ఇప్పటిదాకా కట్టలేదన్నారు.

గజం భూమి విలువ రూ.4 వేలుగా రిజిస్ట్రేషన్‌ విలువ చూపించడం వల్ల 50 నుండి 60 కోట్ల రూపాయలు ఎగవేశారని చెప్పారు. 250 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అప్పనంగా కొట్టేసిన లింగమనేని రమేష్‌ని చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారని ఆర్కే ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా అపార్టుమెంట్లు కానీ స్థలాలు కానీ కొనవద్దన్ని ఆర్కే విజ్ఞప్తి చేశారు. సామాన్యులు అప్పులు తెచ్చుకుని ఇల్లు కడితే, తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్స్‌ చెక్‌ చేసుకోవాలని సూచించారు. ఐదేళ్లలో జరిగిన భూబాగోతాలపై దర్యాప్తు జరిపించాలని సీఎం జగన్‌ను కోరనున్నట్లు ఆర్కే తెలిపారు.

Related posts