రాజమౌళి సినిమా అంటేనే భారీ స్థాయిలో వుంటుంది, అలాంటిది జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ కి ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకి అందలాన్ని తాకుతున్నాయి. మోషన్ పోస్టర్స్ తో ఆకట్టుకున్న రాజమౌళి రాంచరణ్ అల్లూరి లుక్ ని రివీల్ చేసి ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.
ఆ తర్వాత యంగ్ టైగర్ లుక్ వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన అభిమానులకు కరోనా గట్టి దెబ్బ కొట్టింది. లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ లుక్ ని రివీల్ చేయలేక పోయారు. కాగా ఈ నెల 22న భీమ్ టీజర్ రానున్నట్లు ప్రకటించింది యూనిట్. ఇక తాజా సమాచారం ప్రకారం భీమ్ టీజర్ అవుట్ ఫుట్ వీడియో, అలాగే డైలాగ్స్ టాకీ కూడా పూర్తి చేసుకొని ఫైనల్ టచ్ కోసం రెడీగా ఉన్నట్టు టాక్. ఈ టీజర్ కు ఇంకా కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటే బాకీ అన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి దానిని పూర్తి చేసే పనిలోనే ఉన్నట్లు తెలుస్తుంది.