telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

డిస్కోరాజా .. మరో సైన్స్ ఫిక్షన్.. అదే మూస..

DIsco-Raja

నటుడు రవితేజ`డిస్కోరాజా` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల సక్సెస్‌ల వేటలో కాస్త వెనకబడిన రవితేజ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్లు, సాంగ్స్‌ సినిమా మీద అంచనాలు పెంచాయి. కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని ఓ కొత్త జోనర్‌లో ఈ చిత్రం ట్రై చేసాడు రవితేజ. నభ నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ‘>పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. సునీల్, సత్య లాంటి వాళ్ళ కామెడీ ఈ సినిమాకు బలం కానుందని తెలుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ సినిమా, సెటప్స్, హాలీవుడ్ టెక్నీషియన్స్, గ్రాఫిక్స్ అవీ ఇవీ అని చెప్పుకుంటూ వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమాలో టైటిల్ రోల్ అయిన డిస్కో రాజ్ పాత్ర మాత్రమే మెప్పించింది. అసలు మొదలు పెట్టిన సూపర్బ్ సైన్స్ ఫిక్షన్ పాయింట్ ని పక్కన పడేసి రొటీన్ పంథాలో కథని తీసుకెళ్ళడం బోరింగ్ గా అనిపిస్తుంది.

డిస్కో రాజ్ పాత్రని రవితేజ అభిమానులు, సినీ ప్రేక్షకులు సూపర్బ్ ఎంజాయ్ చేస్తారు. అది కూడా గంట మాత్రమే అని తెలుస్తోంది. ఇక ముఖ్యంగా డిస్కో రాజా పాత్రలో రవితేజ నటన సినిమాకు హైలైట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్ మహరాజ్‌ రెండు డిఫరెంట్ లుక్స్‌లో దర్శనమివ్వనున్నాడు. కాగా, ఒకే రకమైన మూస కథలు కాకుండా వైవిధ్యమైన చిత్రాలను తెరకేక్కిస్తుంటారు దర్శకుడు విఐ ఆనంద్‌.. అందులో భాగంగానే ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం డిస్కోరాజా సినిమాని కూడా ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కించాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న(నేడు) రిలీజ్ అయింది.

Related posts