telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్.. ఈరోజు ఎన్నంటే…?

corona covid

ఆంధ్రప్రదేశ్ కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.67 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. తాజా నివేదిక ప్రకారం ఏపీలో కరోనా కేసులు చాలా తగ్గాయి. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 620 కరోనా కేసులు నమోదుకాగా, 7 మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,67,683కి చేరింది. ఇందులో 8,52,298 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,397 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఏపీలో మొత్తం ఇప్పటి వరకు 6988 కరోనా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 3787 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 16, చిత్తూరు 64, తూర్పుగోదావరి జిల్లాలో 40, గుంటూరు 101, కడపలో 48, కృష్ణాలో 85, కర్నూలులో 15, నెల్లూరు 39, ప్రకాశంలో 19, శ్రీకాకుళంలో 15, విశాఖపట్నంలో 36, విజయనగరంలో 35, పశ్చిమ గోదావరిలో 107 కేసులు నమోదయ్యాయి.

Related posts