telugu navyamedia
క్రీడలు వార్తలు

నాలుగో టెస్ట్ కు ఒప్పుకున్న బీసీసీఐ…

భారత జట్టు ఆసీస్ పర్యటనలో భాగంగా భారత్-ఆసీస్ మధ్యలో ప్రస్తుతం నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 15 నుంచి ప్రారంభం కావాల్సిన చివరి టెస్టు జరగడం లేదు అనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అక్కడ యూకే స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రావడంతో మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయం పై ఈ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) క్లారిటీ ఇచ్చింది. నాలుగో టెస్ట్ కు బీసీసీఐ తమకు అనుమతి ఇచ్చిందని, టీం ఇండియా బ్రిస్బేన్కు ప్రయాణించనున్నట్లు తెలిపింది. అలాగే అక్కడ భారత ఆటగాళ్లకు కఠిన క్వారంటైన్‌ ఆంక్షలు సడలించాలని బీసీసీఐ సీఏను కోరింది. ఇక ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ ఈరోజుతో ముగియనుంది. ఈ మ్యాచ్ లో విజయాపజలను బట్టి నాలుగో టెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో విజయ ఎవరు సాధిస్తారు అనేది.

Related posts