telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ వ్యాప్తంగా 13.42 శాతం పోలింగ్ నమోదు

నాలుగో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 6.30 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. 3,299 పంచాయతీలు… 33,435 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే.. ఇప్పటి వరకు పోలింగ్‌ అయిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉయం మొదటి రెండు గంటల్లో 8.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13.42 శాతం పోలింగ్ నమోదు

విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్… నెల్లూరులో
అత్యల్ప పోలింగ్.

జిల్లాల వారీ పోలింగ్ శాతం..

శ్రీకాకుళం 17.97

విజయనగరం 22.5

విశాఖ 18.48

తూర్పు గోదావరి 8.58

పశ్చిమ గోదావరి 14.12

కృష్ణా 8.53

గుంటూరు 13.94

ప్రకాశం 9.31

నెల్లూరు 8.44

చిత్తూరు 12.40

కడప 9.35

కర్నూలు 15.42

అనంతపురం 15.4

Related posts